ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చివేయాలా? ఏపీ ప్రభుత్వంపై జనసేనాని ఫైర్

ఈనెల 30,31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనతో కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. . రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వారు పవన్‌కు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా నిలుస్తానని, రైతుల ఆవేదన తాను అర్ధం చేసుకున్నానని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితిలోనూ తరలించవద్దని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. […]

ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చివేయాలా? ఏపీ ప్రభుత్వంపై జనసేనాని ఫైర్

Edited By:

Updated on: Aug 25, 2019 | 12:21 AM

ఈనెల 30,31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనతో కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. . రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వారు పవన్‌కు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా నిలుస్తానని, రైతుల ఆవేదన తాను అర్ధం చేసుకున్నానని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితిలోనూ తరలించవద్దని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ వెళ్తే వ్యవస్థలపై నమ్మకం పోతుందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం రాజధాని ప్రాంత వాసులది మాత్రమే కాదని, రాష్ట్ర మంతటిదీనని చెప్పారు పవన్.