Jagananna Vidya Kanuka: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరం ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రభుత్వం పాఠశాలలను రీ-ఓపెన్ చేస్తామని.. అదే రోజు సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ అందజేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
దీని కోసం సుమారుగా రూ. 650 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు, విద్యా సంవత్సరంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి.. స్కూళ్లు ప్రారంభానికి ముందే టీచర్ల బదిలీలు ఉంటుందని స్పష్టం చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ జరుగుతుందని ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఇక అక్టోబర్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 30లోపు చివరి సెమిస్టర్ పరీక్షలు.. అలాగే సెప్టెంబర్ 15 నుంచి 21వ తేదీలోపే అన్ని సెట్లను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Also Read: