Jagananna Amma Vodi: ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమానికి జగన్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. జనవరి 9వ తేదీన ‘అమ్మఒడి’ రెండో విడత సొమ్ము తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జనవరి 5వ తేదీ వరకు అమ్మఒడి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న ఆయన.. జనవరి 6వ తేదీన ‘అమ్మఒడి’ అర్హుల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. రెండో విడత ‘అమ్మఒడి’ కింద రూ. 6,450 కోట్లు కేటాయించామన్నారు. గతేడాది ‘అమ్మఒడి’ లబ్ధిదారులు కూడా ఈ రెండో విడతకు అర్హులేనని.. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ‘అమ్మఒడి’ ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.