కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు.. టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు..

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు...

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు.. టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు..

Updated on: Dec 21, 2020 | 6:08 PM

AP Corona Vaccine Distribution: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మున్సిపల్ కమిషనర్ చైర్ పర్సన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్ర, జిల్లా, మండలి స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు కాగా.. స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో మరో ఆరుగురు సభ్యులకు.. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో 16 సభ్యులు, జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో 34 మంది సభ్యులకు స్థానాన్ని కల్పించారు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్‌ను పోలియో వ్యాక్సిన్ తరహాలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే రెండు లేదా మూడు వారాల ముందు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

Also Read:

అడిలైడ్ వైఫల్యం.. రెండో టెస్టుకు టీమిండియాలో భారీ మార్పులు.. ఆ నలుగురిపై వేటు తప్పదు.!

కొత్తరకం కరోనా వైరస్ కలవరం.. కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 31 వరకు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం..

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఇకపై ఎంసీఏ రెండేళ్లే.. కీలక ఉత్తర్వులు జారీ..