అనుకున్న సమయానికే పూర్తి… పారిశ్రామికవేత్తలకు జగన్ గిఫ్ట్

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్నీ అనుకున్న వ్యవధిలో పూర్తి అయ్యేలా సానుకూల వాతావరణాన్ని కల్పించడమే పెద్ద గిఫ్టు అని ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు..

అనుకున్న సమయానికే పూర్తి... పారిశ్రామికవేత్తలకు జగన్ గిఫ్ట్

Updated on: Jun 05, 2020 | 3:59 PM

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్నీ అనుకున్న వ్యవధిలో పూర్తి అయ్యేలా సానుకూల వాతావరణాన్ని కల్పించడమే పెద్ద గిఫ్టు అని ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పెట్టుబడుల్లో డీ-రిస్కింగ్‌ ద్వారా పరిశ్రమలకు పెద్దఎత్తున ఊతమివ్వాలని ఆయన నిర్ణయించారు. శుక్రవారం జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహమని ముఖ్యమంత్రి అన్నారు. ఇండస్ట్రియల్‌ పార్కు, క్లస్టర్లకు పెద్ద పీట వేస్తామని, నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సాహకాలు అందిస్తామని జగన్ వెల్లడించారు. ‘‘పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఉండాలి.. గత ప్రభుత్వం మాదిరిగా మోసంచేసే మాటలు వద్దు.. గత ప్రభుత్వం రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టింది.. విడతల వారీగా ఈ బకాయిలను చెల్లించబోతున్నాం.. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలకు ఒక విడత చెల్లించాం.. మాట నిలబెట్టుకుంటే.. సహజంగానే మనం పోటీలో గెలుస్తాం.. ’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.