దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా సహా ఇతర అనేక రకాల వైరస్‌లను నిరోధించడం కోసం పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ వర్సిటీ విద్యార్థులు ఎలక్ట్రానిక్ మాస్కును తయారు చేశారు. ఈ మాస్కు సమీపంలోకి వచ్చే ఏ వైరస్ అయినా విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల నశించిపోతుందని వారు తెలిపారు.
కాగా.. ఈ మాస్కు దానికదే చార్జింగ్ అవుతుందన్నారు. మార్కెట్‌లో లభిస్తున్న మూడు పొరల సర్జికల్ మాస్కు కంటే ఎలక్ట్రానిక్ మాస్కు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. సంబంధిత అధికారుల నుంచి ఆమోదం లభించాక మాస్కులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!