చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్

|

Jan 09, 2020 | 6:38 PM

రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా ఉద్యమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయలసీమ విద్యార్థి జెఎసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటే చంద్రబాబును రాయలసీమలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించింది. 2014లో శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ఇపుడు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు జెఎసీ నేతలు. అమరావతి రాజధానిని పరిరక్షించుకునేందుకు చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్రపై రాయలసీమ విద్యార్థి సంఘాల జెఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెఏసీ ఛైర్మెన్ కోనేటి వెంకటేశ్వర్లు కర్నూలులో […]

చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on

రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా ఉద్యమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయలసీమ విద్యార్థి జెఎసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటే చంద్రబాబును రాయలసీమలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించింది. 2014లో శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ఇపుడు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు జెఎసీ నేతలు.

అమరావతి రాజధానిని పరిరక్షించుకునేందుకు చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్రపై రాయలసీమ విద్యార్థి సంఘాల జెఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెఏసీ ఛైర్మెన్ కోనేటి వెంకటేశ్వర్లు కర్నూలులో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే విధంగా చంద్రబాబు యాత్ర చేపడితే అడ్డుకొని తీరుతామని ఆయన హెచ్చరించారు. కర్నూలుకు అన్యాయం చేయాలని చూస్తే రాయలసీమ ప్రజల ఆగ్రహం చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

తన స్వార్థ రాజకీయాలతో రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు జెఏసీ ప్రతినిధులు. కర్నూల్లో హైకోర్టు అన్నది రాయలసీమ ప్రజల హక్కని, తమ హక్కులు కాలరాసేలా చంద్రబాబు చేస్తున్న కుట్రలను సీమ బిడ్డలుగా తిప్పికొడతామని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటూ చంద్రబాబు బస్సు యాత్ర చేపడితే రాయలసీమ జిల్లాల్లో బాబును తిరగనివ్వమని చెప్పారు.