కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇటలీలో విజృంభిస్తోంది. కరోనా పుట్టిల్లు చైనాలో కన్నా ఇటలీలొనే ఎక్కువమంది ఈ వైరస్ కు బలయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెండ్రోజులుగా ఇటలీలో కరోనా మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తోందని అంతా భావించారు. కానీ ఈ అంచనాలన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఎందుకంటే ఇటలీలో మృతుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గడిచిన 24గంటల్లో ఇక్కడ 743 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. సోమవారం ఈ సంఖ్య 608గా ఉంది. అలానే కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 69,176. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత ఇటలీనే ఉంది.
Also Read : 40 గంటల తర్వాత.. ఢిల్లీలో.. ఐదు కరోనా పాజిటివ్ కేసులు..!