సుమక్కకు జీఎస్టీ తిప్పలు.. కెరీర్ ఇక కష్టమేనా.?

|

Dec 12, 2019 | 8:02 PM

టాలీవుడ్ యాంకర్లలో సుమకంటూ  ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరను ఏలేస్తోంది. ఈవెంట్లు, రియాలిటీ షోలు.. గేమ్ షోలు.. ఆడియో ఫంక్షన్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ కూడా సుమ హోస్టుగా వ్యవహరించాల్సిందేనని చాలామంది హీరోలు పట్టుబడతారు. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది. […]

సుమక్కకు జీఎస్టీ తిప్పలు.. కెరీర్ ఇక కష్టమేనా.?
Follow us on

టాలీవుడ్ యాంకర్లలో సుమకంటూ  ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరను ఏలేస్తోంది. ఈవెంట్లు, రియాలిటీ షోలు.. గేమ్ షోలు.. ఆడియో ఫంక్షన్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ కూడా సుమ హోస్టుగా వ్యవహరించాల్సిందేనని చాలామంది హీరోలు పట్టుబడతారు. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సుమ రెండు గంటల వ్యవధి ఉన్న ఒక్కో షోకు రూ.3-5 లక్షలు డిమాండ్ చేస్తోందట. అంతేకాక జీఎస్టీ అదనంగా బాదేస్తోందని వినికిడి. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపెడవుతోందని సమాచారం. అందుకే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట. అటు చిన్న సినిమాలకు కూడా సుమ ఇదే విధంగా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం వల్ల ఈమె స్థానంలో మరో యాంకర్ మంజూషను తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్లయినా.. యాంకరమ్మలైనా అధిక రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తే.. నిర్మాతలు పక్కన పెట్టేసినట్లే..