ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ చిత్రం పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో నటించడానికి క్యూ కడుతున్నారు. కియారా అద్వానీ నుంచి అలియా భట్ వరకు అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీపై మక్కువ చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ అయితే ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం బట్టి అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ‘మేజర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడానికి అలియా భట్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అలియాకు కథ వినిపించినట్లు వినికిడి. అయితే ఈ క్రేజీ హీరోయిన్ దగ్గర నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉందని తెలుస్తోంది. చూడాలి అలియా ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటుందో లేదో మరి.?