AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తత్కాల్‌తో పనిలేకుండా లాస్ట్‌ మినిట్‌లో కన్ఫార్మ్ సీటు కావాలా? ఈ స్మార్ట్ ట్రిక్ వాడండి!

రైలు ప్రయాణానికి కన్ఫర్మ్ టికెట్ దొరకడం కష్టమా? తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో లేనప్పుడు చివరి నిమిషంలో సీటు పొందాలంటే IRCTC అందించే 'Charts/Vacancy' ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. రైలు బయలుదేరే 4 గంటల ముందు విడుదలయ్యే తుది చార్టులో ఖాళీగా ఉన్న బెర్త్‌లను గుర్తించి, వాటిని సులభంగా బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్‌తో పనిలేకుండా లాస్ట్‌ మినిట్‌లో కన్ఫార్మ్ సీటు కావాలా? ఈ స్మార్ట్ ట్రిక్ వాడండి!
Indian Railways Children's
SN Pasha
|

Updated on: Feb 19, 2026 | 6:14 PM

Share

రైలు ప్రయాణం ప్లాన్ చేసేప్పుడు కన్ఫర్మ్ టికెట్ దొరకడం చాలా సార్లు కష్టమే. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్లు కొన్ని సెకన్లలోనే అయిపోతాయి. అయితే భారతీయ రైల్వేలు అందించే అధికారిక ఆన్‌లైన్ ఫీచర్‌ను ఉపయోగిస్తే, తత్కాల్ లేకుండానే చివరి నిమిషంలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఉన్న Charts/Vacancy ఫీచర్ చాలా ముఖ్యం. తుది రిజర్వేషన్ చార్ట్ సాధారణంగా రైలు బయలుదేరే ముందు సుమారు 4 గంటలకే సిద్ధమవుతుంది. ఆ తర్వాత రద్దయిన లేదా బుక్ కాని బెర్తులు సిస్టమ్‌లో ఖాళీగా కనిపిస్తాయి. ఇవి సాధారణ బుకింగ్ లేదా తత్కాల్ సమయంలో కనిపించవు. రియల్‌టైమ్‌లో నిజమైన ఖాళీలు తెలుస్తాయి. అలాంటి వాటిని బుక్‌ చేసుకుంటే.. మీకు కన్ఫార్మ్‌ సీటు దొరుకుతుంది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

  • IRCTC వెబ్‌సైట్ లేదా Rail Connect యాప్ ఓపెన్ చేయండి
  • Charts/Vacancy సెక్షన్‌కు వెళ్లండి
  • రైలు నంబర్, బోర్డింగ్ స్టేషన్ నమోదు చేయండి
  • క్లాస్ (AC/స్లీపర్) ఎంచుకోండి
  • గ్రీన్‌ కలర్‌లో కనిపించే బెర్తులు ఖాళీగా ఉన్నట్లు
  • అవి వెంటనే బుక్ చేసుకోవచ్చు
  • ఇప్పటికే టికెట్ ఉంటే, ఖాళీ ఉంటే TTEని సంప్రదించవచ్చు.

ఇలా బెర్త్‌లు బుక్‌ చేసుకోవడానికి చార్ట్ రిలీజ్ అయిన వెంటనే చెక్ చేయండి. మొబైల్ యాప్ ఉపయోగిస్తే వేగంగా అప్‌డేట్స్ వస్తాయి. ఖాళీ స్క్రీన్‌షాట్‌ను TTEకి చూపితే సహాయం పొందే అవకాశం ఉంటుంది. కొన్ని సీట్లు మధ్య స్టేషన్లకే పరిమితం కావచ్చు, జాగ్రత్తగా చూడటం ముఖ్యం. ఇలాంటి ట్రిక్‌లు తత్కాల్ మిస్ అయినప్పుడు, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పుడు, పీక్ సీజన్/పండుగల సమయంలో మీకు ఉపయోగపడొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us