
Twist In IPL 2020 Sponsorship: ఐపీఎల్ 2020 స్పాన్సర్ షిప్ హక్కులను క్రికెట్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని లీగ్ చైర్మన్ బ్రిజేష్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇప్పుడు దీనిపై సందిగ్దత నెలకొంది. ఐపీఎల్ 2021, 2022 సీజన్లకు డ్రీమ్ 11ను తిరిగి బిడ్లు వేయాలని బీసీసీఐ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఐపీఎల్ సీజన్లలకు డ్రీమ్ 11 ఎంత ఎక్కువ మొత్తంలో బిడ్ వేస్తుందోన్న దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతే బీసీసీఐ ఈ ఏడాది ఆఫర్‌ను ఫైనల్ చేస్తుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌పై బీసీసీఐ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడానికి ఇదే కారణమని బోర్డు సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చైనా కంపెనీ ‘వివో’ ఈ ఏడాది స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో.. డ్రీమ్ 11 సుమారు రూ.240 కోట్ల బిడ్ వేసి టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకుంది.
అయితే ఒకవేళ వచ్చే ఏడాది కూడా వివో తిరిగి రాకపోతే డ్రీమ్ 11 2021, 2022 ఐపీఎల్ సీజన్లకు ఏడాదికి రూ. 240 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రస్తుతం డ్రీమ్ 11, బీసీసీఐ మధ్య షరతులతో కూడిన మూడేళ్ల ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..
మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!
ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!