AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసులకు చిక్కిన బుకీలు

ఊరూవాడా బెట్టింగ్‌ ఊపేస్తోంది.. పల్లెపట్నం బెట్టింగ్‌ మాయలో పడుతోంది. ఐపీఎల్‌ ఫీవర్‌లో పడుతున్న యువత ఉసూరుమంటోంది.. తాజాగా పలు జిల్లాల్లో బెట్టింగ్‌ బ్యాచ్‌ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది..

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసులకు చిక్కిన బుకీలు
Sanjay Kasula
|

Updated on: Oct 11, 2020 | 7:30 PM

Share

ఊరూవాడా బెట్టింగ్‌ ఊపేస్తోంది.. పల్లెపట్నం బెట్టింగ్‌ మాయలో పడుతోంది. ఐపీఎల్‌ ఫీవర్‌లో పడుతున్న యువత ఉసూరుమంటోంది.. తాజాగా పలు జిల్లాల్లో బెట్టింగ్‌ బ్యాచ్‌ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐపీఎల్ బెట్టింగ్‌లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలు, 14 మంది బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 17 మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఇతర సామగ్రిని నూజివీడు పోలీసులు సీజ్ చేశారు. బుకీలు, బెట్టింగ్‌రాయుళ్లను మీడియాకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చూపించారు.

ఇక.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఐపీఎల్‌ బెట్టింగ్‌ దర్జాగా సాగుతోంది.. పోలీసులు దాడిలో ఆరుగురు యువకులు పట్టుబడ్డారు. ఇందులో ఒకరు పరారు కాగా.. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, 87 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. కార్వాన్‌కు చెందిన ఆకాష్‌సింగ్, వినయ్‌సింగ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, లక్షా 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో