ఐపీఎల్ 2020: గెలుస్తారా.. లేక నిష్క్రమిస్తారా..

ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన

  • Ravi Kiran
  • Publish Date - 4:24 pm, Fri, 6 November 20
ఐపీఎల్ 2020: గెలుస్తారా.. లేక నిష్క్రమిస్తారా..

ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2లో ఆడుతుంది. గత మ్యాచ్‌లో ముంబైపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ మంచి ఊపు మీదుంది. టైటిల్ టార్గెట్‌గా ఈ మ్యాచ్‌లో గెలవాలని కసితో ఉంది. ఇక రెండు జట్లు దేనికి తీసిపోవు. రెండూ బలమైన జట్లే! గెలుపు డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌దా? లేక విరాట్‌ కోహ్లీ జట్టుదా? అన్నది చెప్పడం కష్టమే! వార్నర్ సారధ్యంలో హైదరాబాద్ జట్టు అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ విభాగాలలో బలంగా ఉంది. అలాగే కోహ్లీ అండ్ కో ఈ సీజన్‌లో కప్పు గెలవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మొదట్లో జట్టు కూర్పుతో ఇబ్బందిపడ్డ వార్నర్ సేన.. ఓపెనర్‌గా సాహాను బరిలోకి దింపడంతో వారి సమస్యలు తీరినట్లే అనిపిస్తున్నాయి. అలాగే ఆల్‌రౌండర్‌ జసన్ హోల్డర్, బౌలర్లు రషీద్ ఖాన్, సందీప్ శర్మ ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించడం వారికి కలిసొచ్చే అంశం. బెంగళూరు జట్టుకు మిడిల్ ఆర్డర్ ఆటతీరు చాలా ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ స్లో-బ్యాటింగ్ వారిని దెబ్బతీస్తోంది. అలాగే గాయం కారణంగా క్రిస్‌ మోరిస్‌ ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటే వారికి చాలా ప్రాబ్లెమ్ ఎడురవుతుంది. మరి ఎలిమినేటర్ మ్యాచ్‌కు కోహ్లీ ఎవరికి ఓటేస్తాడన్నది ఆసక్తిగా మారింది..

బెంగళూరు టీమ్‌(అంచనా): విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేందర్ ఛహల్, క్రిస్ మోరిస్/ఇసురు ఉడాన, దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్పే, మొయిన్ అలీ, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ/శహబాజ్ అహ్మద్, శివ్ దూబే, వాషింగ్టన్ సుందర్

హైదరాబాద్ టీమ్‌(అంచనా) : డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మనీష్ పాండే, అబ్దుల్లా సమద్, అభిషేక్ శర్మ/ప్రియం గార్గ్, సందీప్ శర్మ, సాహా, హోల్డర్, నదీం, నటరాజన్