ధోని ప్లేస్‌ను ఎవరూ భర్తీ చేయలేరంటున్న గంభీర్‌

మహేంద్రసింగ్‌ ధోని.. ఈ పేరే ఓ వైబ్రేషన్‌.. ఓ సెన్సేషన్‌...ఓ డిటర్మినేషన్‌.. క్రికెట్‌లో ఇప్పుడెన్ని ఫార్మాట్లు ఉన్నాయో అన్నింట్లోనూ ధోని తన మార్క్‌ను చాటుకున్నాడు..

ధోని ప్లేస్‌ను ఎవరూ భర్తీ చేయలేరంటున్న గంభీర్‌
Follow us

|

Updated on: Nov 06, 2020 | 4:25 PM

మహేంద్రసింగ్‌ ధోని.. ఈ పేరే ఓ వైబ్రేషన్‌.. ఓ సెన్సేషన్‌…ఓ డిటర్మినేషన్‌.. క్రికెట్‌లో ఇప్పుడెన్ని ఫార్మాట్లు ఉన్నాయో అన్నింట్లోనూ ధోని తన మార్క్‌ను చాటుకున్నాడు.. అన్నింటిలోనూ రికార్డులు సాధించాడు.. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించిన ఘనుడు.. ఇక వ్యక్తిగత రికార్డుల గురించి చెప్పనే అక్కర్లేదు.. ఎంత గొప్ప ఆటగాడికైనా ఎప్పుడో ఒకప్పుడు ఆటలోంచి నిష్క్రమించకతప్పదు.. ధోని కూడా ఆడినన్నాళ్లు అద్భుతంగా ఆడాడు.. ఇంక తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందని తెలుసుకుని హుందాగా అందులోంచి తప్పుకున్నాడు.. ఇప్పుడు ధోని ప్లేస్‌ను భర్తి చేసేది ఎవరు? నిజమే.. ఆలోచిస్తే సంక్లిష్టంగానే అనిపిస్తుంటుంది.. ఎందుకంటే ధోనికి సమ ఉజ్జిలు కనిపించడం లేదు.. కాస్తో కూస్తో ఢిల్లీ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ ఓకే అనిపిస్తున్నాడు. టీ-20లలో చక్కగా రాణిస్తున్న ఈ ఆటగాడు అనతి కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.. ఇక అప్పట్నుంచి పంత్‌ను ధోనీతో పోల్చడం మొదలయ్యింది.. అయితే ఇటీవలి కాలంలో పంత్‌ మెరుగైన ఆటను కనబర్చలేకపోతున్నాడు. లిమిటెడ్‌ ఓవర్ల క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా స్థిరపడిపోయాడు.. దీంతో పంత్‌ అవకాశాలు తగ్గిపోయాయి. అసలు ధోనితో పంత్‌ను పోల్చడమే సరైంది కాదంటున్నాడు మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. పంత్‌ ఏనాటికీ ధోని కాలేడని, పంత్‌ను పంత్‌లాగే ఉండనివ్వండని సూచించాడు గంభీర్‌.. ధోనిలా ధనాధన్‌ క్రికెట్‌ ఆడినంతమాత్రాన ఎవరూ ధోని కాలేరని, ఆయనది ప్రత్యేకమైన శైలి అని గంభీర్‌ పేర్కొన్నాడు. పంత్‌ తన ఆట తీరును ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు..