కొత్త రుణాలు తీసుకోవద్దు.. 3 ఏళ్ల ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ హెచ్చరిక!
ప్రస్తుతం ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న వేళ, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ముత్తుకృష్ణన్ దండపాణి చేసిన సూచనలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాలు లేదా కఠిన సమయాలను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్పిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ముత్తుకృష్ణన్ దండపాణి భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సవాళ్ల గురించి హెచ్చరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే రోజుల్లో కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు కొత్తగా ఎలాంటి రుణాలు తీసుకోకూడదని ఆయన సూచించారు. కుటుంబ అవసరాల కోసం కనీసం 3 సంవత్సరాల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ముత్తుకృష్ణన్ దండపాణి ప్రకారం..
ప్రధాన సూచనలు:
3 ఏళ్ల ఎమర్జెన్సీ ఫండ్:
సాధారణంగా ఆర్థిక నిపుణులు 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని దాచుకోవాలని చెబుతుంటారు. అయితే దండపాణి మాత్రం తమ కుటుంబం పూర్తి ఖర్చులకు సరిపడేలా కనీసం 3 సంవత్సరాల నిధిని సమకూర్చుకోవాలని తీవ్రంగా ప్రతిపాదించారు.
కొత్త రుణాలు వద్దు:
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి కొత్త అప్పులు లేదా రుణాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కొత్త ఇల్లు లేదా భారీ ఇఎంఐలు ఉండే సుదీర్ఘకాల ఆర్థిక కట్టుబాట్లలోకి ఇప్పుడు అడుగు పెట్టవద్దని సూచించారు.
స్థిరమైన ఆదాయంపై దృష్టి:
ఉద్యోగంలో పాత్ర లేదా హోదా గురించి ఎక్కువ ఆలోచించకుండా, ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
మార్కెట్ స్పందన – నెటిజన్ల అభిప్రాయాలు:
స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న సమయంలో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆర్థిక చక్రంలో ఒడిదుడుకులు సహజమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆకస్మిక సంక్షోభం ఎదురైనా మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని కొందరు సమర్థించారు.
I’m no Nostradamus.
I’ve been cautioning for the last two years about some of the possibilities I saw coming.
I’ll repeat it for the nth time.
Try your level best to create a safe reserve or emergency corpus that can cover three years of your family’s complete expenses.
Don’t borrow. No fresh loans.
Don’t take on long term commitments like real estate or a house purchase.
Don’t be too specific about jobs and roles. Now is the time to focus on ensuring income.
It’s not that the sky is going to fall.
The world has faced such crises in the past. It will see them in future too.
Doing these things would help you manage tough times financially and emotionally.
And good times will definitely be back in the future.
Such is the nature of cycles.
— Muthukrishnan Dhandapani (@dmuthuk) September 29, 2026
మధ్యతరగతి కుటుంబాలకు 3 నెలల అత్యవసర నిధిని పోగు చేయడమే గగనంగా ఉన్న రోజుల్లో, 3 సంవత్సరాల పొదుపు నిధిని ఎలా సమకూర్చుకోగలమని పలువురు ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రజలందరూ కొనుగోళ్లు తగ్గించి డబ్బు దాచుకుంటే వ్యాపారాలు క్షీణించి నిరుద్యోగం పెరుగుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
చివరగా, భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఆర్థిక చక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెబుతూ, ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటమే శ్రేయస్కరమని ఆయన స్పష్టం చేశారు.




