మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను గంటల తరబడి ప్రశ్నించిన ట్రంప్
అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి మదురోను పట్టుకుంటే.. అక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారు? అంటూ ట్రంప్ Grokను ప్రశ్నించారు. మదురోను అధికారంలో నుంచి తొలగిస్తే వెనిజులాలో ప్రజలు దాన్ని స్వాగతించే అవకాశం ఉందని Grok సమాధానం ఇచ్చింది. టైమ్ మ్యాగజైన్ ప్రకారం.. మదురోను పట్టుకునే ఆపరేషన్‌కు సుమారు నెల రోజుల ముందు, అంటే డిసెంబర్ 2025లో ట్రంప్.. ఎలాన్ మస్క్‌కు చెందిన AI చాట్‌బాట్ Grokను గంటల తరబడి ప్రశ్నించారు.

ఆ తర్వాత జనవరి 2026లో అమెరికా బలగాలు వెనిజులా రాజధాని కరాకస్‌పై సైనిక ఆపరేషన్ చేపట్టాయి. మదురో, ఆయన భార్య అమెరికా అదుపులోకి వెళ్లారు. ఆ సమయంలో వెనిజులాలో మదురో వ్యతిరేకవర్గాల్లో సంబరాలు కనిపించాయి. ట్రంప్ కూడా Grok చెప్పిన సమాధానం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సరిపోలడంతో ఆశ్చర్యపోయారు. అయితే Grok సమాధానం వల్లే మదురోను పట్టుకునే నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు.
ఆపరేషన్‌కు ముందు Grokను ఆశ్రయించిన ట్రంప్?
వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు పట్టుకునే ముందు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటల తరబడి AI చాట్‌బాట్ Grokను ప్రశ్నించినట్లు టైమ్ మేగజైన్ నివేదిక సంచలనం రేపుతోంది. అసలు ట్రంప్ ఏం అడిగారు? Grok ఏం సమాధానం ఇచ్చింది? మదురోను పట్టుకునే ఆపరేషన్‌లో AI పాత్ర ఎంత.. కరాకస్‌లోని ఆ రాత్రి.. అమెరికా సైనిక ఆపరేషన్ మొదలైంది. గగనతలం, సముద్రం, భూమి.. మూడు మార్గాల్లో అమెరికా బలగాలు రంగంలోకి దిగాయి. కొన్ని గంటల్లోనే వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ అమెరికా అదుపులోకి వెళ్లిపోయారు. అయితే ఈ ఆపరేషన్ వెనుక కథ అంతా యుద్ధ ప్రణాళికలతోనే నిండిపోలేదని AI చాట్‌బాట్ Grok ముఖ్యపాత్ర ఉందని తెలిసింది
నెలల తరబడి సాగిన రహస్య ప్రణాళిక
మదురోను పట్టుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికా సైనిక, ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆపరేషన్ కోసం నెలల తరబడి ప్రణాళికను సిద్ధం చేసాయి. అంతేకాదు.. ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలోని Department of Government Efficiency (DOGE) బాధ్యతల నుంచి తప్పుకున్న సుమారు ఏడు నెలల తర్వాత ట్రంప్‌తో రహస్యంగా సమావేశమయ్యారు.
‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’.. రెండు గంటల 20 నిమిషాల్లో!
మదురోను పట్టుకునేందుకు చేపట్టిన సైనిక చర్యకు ‘Operation Absolute Resolve’ అనే పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ సుమారు 2 గంటల 20 నిమిషాల పాటు కొనసాగింది. గగనతలం, సముద్రం, భూమి నుంచి అమెరికా బలగాలు సమన్వయంతో ముందుకు కదిలాయి. ఇది జరుగుతున్న సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నుంచి ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు అమెరికా సైనిక ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తర్వాత ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. ఆ ఆపరేషన్‌ను తాను టీవీ కార్యక్రమం చూస్తున్నట్లుగా చూశానని వివరించారు.

Maduro Captured And Flown Out Of Venezuela By Us Army
మదురోను పట్టుకునే సైనిక ఆపరేషన్‌కు ముందు అమెరికా అధ్యక్షుడు AIని సంప్రదించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. యుద్ధాలు, సైనిక చర్యలు, ప్రభుత్వ నిర్ణయాల్లో AI పాత్ర ఎంత? ఒక దేశ ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు AIని అడిగి తెలుసుకోవడం ఒకెత్తు అయితే ఆ సమాధానాలతో అత్యంత కీలకమైన ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవడమా? మదురోను పట్టుకునే ఆపరేషన్‌కు Grok నిజంగా ప్రభావం చూపిందా? లేక అది కేవలం ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ముందు జరిగిన ఒక AI సంప్రదింపేనా అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది.