ప్రజా ఆందోళనలతో దిగివచ్చిన మయన్మార్ సైన్యం.. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

|

Feb 08, 2021 | 7:37 AM

మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది.

ప్రజా ఆందోళనలతో దిగివచ్చిన మయన్మార్ సైన్యం.. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
Follow us on

Internet access partially restored in Myanmar : మయన్మార్‌లో ప్రజా ఆగ్రహానికి తలవంచిన సైన్యం ఇంటర్నెట్‌ సేవలను ఆదివారం పునరుద్ధరించింది. ఫిబ్రవరి 1న జరిగిన సైనిక తిరుగుబాటుతో మియన్మార్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కింది. ఆ దేశానికి నాయకత్వం వహిస్తున్నఆంగ్‌ సాన్‌ సూచీతోపాటు ఇతర పార్లమెంటు సభ్యులను కూడా సైన్యం నిర్బంధించింది. దీంతో ప్రజలు ఆందోళనల బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలను సైన్యం నిలిపివేసింది.

మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాపౌ అంక్షలు విధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిషేధించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయం సేవలను నిలిపివేయడంపై మయన్మార్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.

ఇదీ చదవండి… Uttarakhand Glacier Burst Updates: తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న 16 మంది సురక్షితం.. ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ..