ఇంటర్‌ మొదటి విడత ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

| Edited By:

May 10, 2019 | 8:50 PM

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత ప్రవేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. ఒక్కో సెక్షన్‌లో 88 మందికి మించి చేర్చుకోకూడదని ఆయన కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. […]

ఇంటర్‌ మొదటి విడత ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల
Follow us on

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత ప్రవేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. ఒక్కో సెక్షన్‌లో 88 మందికి మించి చేర్చుకోకూడదని ఆయన కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన కళాశాలల వివరాలన్నీ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయన్నారు.