Yuganiki Okkadu Update: చోళ వారసుడిగా కనిపించినున్న ధనుష్… ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘యుగానికి ఒక్కడు 2’ వార్త..
Dhanush Role In Yuganiki Okkadu Sequel: తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆయిరాతిల్ ఒరువన్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో..
Dhanush Role In Yuganiki Okkadu Sequel: తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆయిరాతిల్ ఒరువన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘యూగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సెల్వ రాఘవన్. తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ ప్రాధాన పాత్రలో నటించనున్నట్లు కూడా తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. యుగానికి ఒక్కడు సీక్వెల్‌లో అంతా అనుకుంటున్నట్లు ధనుష్… కార్తీ పాత్రలో నటించట్లేదని సమాచారం. తొలి భాగంలో వచ్చే ఓ పాత్రకు కొనసాగింపుగా ఉంటుందని తెలుస్తోంది. యూగానికి ఒక్కడు తొలిపార్ట్‌లో పాండ్య వంశస్థులు చేసిన దాడిలో చోళులు అందరూ మరణించగా చోళ వంశానికి చెందిన చిట్ట చివరి వారసుడితో కార్తీ కనుమరుగవుతాడు. ఇప్పుడు తెరకెక్కబోయే సినిమాలో ధనుష్ కుర్రాడి పాత్రలోనే కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలా షూటింగ్‌కు ముందే ఆసక్తిరేకెత్తిస్తోన్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.
Also Read: Sohail: హిందీ వెబ్ సీరిస్లో హీరోగా బిగ్బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..