భార్యకు పెళ్లి రోజు కానుకగా చంద్రుడిపై స్థలం

|

Sep 24, 2020 | 5:58 PM

వివాహవార్షికోత్సవం రోజున తన అర్ధాంగికో అందమైన కానుకను ఇద్దామనుకున్నాడు పాకిస్తాన్‌కు చెందిన సోహైబ్‌ అహ్మద్‌.. ఆకాశం దించివ్వడమో.... నెలవంక తుంచివ్వడమో కాకుండా అంతకు మించిన బహుమతి ఏముంటుందా అని తెగ ఆలోచించాడు..

భార్యకు పెళ్లి రోజు కానుకగా చంద్రుడిపై స్థలం
Follow us on

వివాహవార్షికోత్సవం రోజున తన అర్ధాంగికో అందమైన కానుకను ఇద్దామనుకున్నాడు పాకిస్తాన్‌కు చెందిన సోహైబ్‌ అహ్మద్‌.. ఆకాశం దించివ్వడమో…. నెలవంక తుంచివ్వడమో కాకుండా అంతకు మించిన బహుమతి ఏముంటుందా అని తెగ ఆలోచించాడు.. చించగా చించగా.. మన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చంద్రుడిపై జాగా కొన్న విషయం గుర్తుకొచ్చింది.. వెంటనే చంద్రమండలంపై ఓ ఎకరం జాగా కొనేసి శ్రీమతికి బహుమతిగా ఇచ్చాడు.. రావల్పిండిలో నివాసం ఉంటున్న సోహైబ్‌ అహ్మద్‌ కొన్నది చంద్రుడిపై సీ ఆఫ్‌ వెపర్‌ ప్రాంతంలో ! ఇంటర్నేషనల్‌ ల్యూనార్‌ ల్యాండ్‌ రిజిస్ట్రీ దగ్గర 45 డాలర్లు పోసి మరీ కొన్నాడు.. అంత చీపా అని ఆశ్చర్యపోకండి.. చంద్రుడి మీద అంతే ఉంటుంది..
2018 లో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా చందమామపై సీ ఆఫ్ మస్కోవి అనే ప్రాంతంలో కొద్దిపాటి స్థలం కొన్నాడు. సెలబ్రిటీలకు అదో సరదా…ప్రముఖ హీరోలు టామ్ క్రూజ్, షారూఖ్ ఖాన్‌లకు కూడా జాబిల్లిపై జాగాలున్నాయి.. తన రాజు నెలరాజు మీద తన కోసం జాగా కొన్నాడని చెబితే మొదట ఎవరూ నమ్మలేదని అహ్మద్‌ అర్ధాంగి మదిహా చెప్పుకొచ్చారు .. అందరూ జోక్‌ అని కొట్టిపారేశారట! డ్యాకుమెంట్లు చూపిస్తే కానీ నమ్మలేదట! తనకున్న జాగా పక్కనే తన స్నేహితురాలు కూడా ఓ చిన్న స్థలం కొనాలని డిసైడయ్యిందని మదిహా అంటోంది.. యూఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా తమ ఇంటి దగ్గర చంద్రునిపై కొన్న స్థల పత్రాలను అందుకున్నారు ఈ దంపతులు.