దత్తపీఠంతో ఎస్పీ బాలుకు విడదీయలేని బంధం

అవధూత దత్తపీఠంతో ఎస్పీ బాలుకు విడదీయలేని బంధం ఉందన్నారు మైసూర్ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీ. ఆయన లేకపోవటం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. బాలు.. ఆధ్యాత్మిక గానగంధర్వుడు. సంగీత రంగానికి మేరు శిఖరం.

దత్తపీఠంతో ఎస్పీ బాలుకు విడదీయలేని బంధం

Updated on: Sep 25, 2020 | 11:53 PM

అవధూత దత్తపీఠంతో ఎస్పీ బాలుకు విడదీయలేని బంధం ఉందన్నారు మైసూర్ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీ. ఆయన లేకపోవటం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. బాలు.. ఆధ్యాత్మిక గానగంధర్వుడు. సంగీత రంగానికి మేరు శిఖరం.

తన తండ్రి సాంబమూర్తి ద్వారా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ సీతారామచంద్రస్వామి అనుగ్రహం సంపాదించుకున్నారని సచ్చిదానంద అన్నారు. ఎన్నో ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నా దత్తస్వామి అనుగ్రహంతో 2008లో దత్తపీఠానికి నాదనిధి అయ్యారన్నారు.