మైసూర్‌ దసరా ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్

|

Oct 25, 2020 | 9:40 PM

కరోనా ప్రభావం మైసూర్‌ దసరా ఉత్సవాలపై స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మైసూర్‌ ప్యాలెస్‌లో రాజకుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాజు యధువీర్‌ కృష్ణదత్తా చామరాజు వడియార్‌ మైసూర్‌ ప్యాలెస్‌లో ఆయుధ పూజ చేశారు...

మైసూర్‌ దసరా ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్
Follow us on

Mysore Dussehra : కరోనా ప్రభావం మైసూర్‌ దసరా ఉత్సవాలపై స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మైసూర్‌ ప్యాలెస్‌లో రాజకుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాజు యధువీర్‌ కృష్ణదత్తా చామరాజు వడియార్‌ మైసూర్‌ ప్యాలెస్‌లో ఆయుధ పూజ చేశారు.

మైసూర్‌ దసరా ఉత్సవాల్లో హైలెట్‌గా నిలిచే ఏనుగు అంబారీ సవారీకి కేవలం 300 అతిధులకు మాత్రమే అనుమతిచ్చారు. అది కూడా కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వాళ్లకే అనుమతిస్తున్నారు. మంగళవారం వరకు మైసూర్‌లో దసరా ఉత్సవాలు కొనసాగుతాయి. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ ఉత్సవాలను అధికారులు నిర్వహిస్తున్నారు.

ఏనుగు అంబారీ కోసం ఇప్పటికే గజరాజులను సిద్దం చేశారు. దసరా ఉత్సవాల కోసం మైసూర్‌ ప్యాలెస్‌ను అందంగా అలంకరించారు. జనానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.