తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలా ఒకొక్క విశేషాన్ని, విశిష్టతను సొంతం చేసుకుంది. ఆషాడ మాసం వచ్చిందంటే చాలు తెలుగువారికి పండగలు మొదలవుతాయి. తెలుగు సంవత్సరంలో హిందువుల తొలిపండగ ఆషాడ మాసంలో వస్తుంది. ఈ తొలి ఏకాదశితో పండగల పర్వాలు మొదలవుతాయి. అంతేకాదు గ్రామ గ్రామాన కొలువైన గ్రామదేవతకు జరిపే జాతరలు, ఉత్సవాలతో ఈ నెల అంతా సందడే సందడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇందరకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడబడుచుగా భావించి మహిళలు సారెను సమర్పిస్తారు. ఆషాడ మాసం మొదలైన నేపథ్యంలో ఈరోజు నుండి అమ్మవారికి ఆషాడమాసం సారె సమర్పణ మొదలయింది. ఈ కార్యక్రమం జూలై 17 వరకు సాగనుంది.
దుర్గమ్మను ఆడపడుచు గా భావించి భక్తులు ఆషాడ మాసంలో సారే సమర్పించడం ఆనవాయితీ వస్తుంది. సంప్రదాయం ప్రకారం ఆలయ వైదిక కమిటీ, అర్చక స్వాములతో పాటు భక్తులు కుటుంబ సమేతంగా కనక దుర్గమ్మకు సారెను సమర్పిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమ్మవారి ఆలయంలో నిర్వహించే శాకాంబరీ ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి 3 వ తేదీ వరకూ ఇంద్రకీలాద్రి పై శాకంబరీ దేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరిస్తారు. ఈ మేరకు దాతల ద్వారా కూరగాయలు, పళ్లు సేకరించారున్నారు.
జూలై రెండవ తేదీన దుర్గమ్మ కు హైదరాబాద్ మహంకాళి బోనాల కమిటీ ఆషాడ మాసం సారెను, బంగారపు బోనం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 5000 మంది భక్తులు పాల్గొననున్నారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో బేతాళ వేషాలతో దుర్గమ్మకు మహంకాళి బోనాల కమిటీ బోనాన్ని సమర్పించనుంది. ఇప్పటికే జులై 14 వ తేదీన హైదరాబాద్ బోనాల కమిటీ వారు తాము నిర్వహించే 8 గ్రామదేవతల ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..