మరో భారతీయుడికి అరుదైన గౌరవం

మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని కీలక పదవి వరించింది.

మరో భారతీయుడికి అరుదైన గౌరవం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 7:14 PM

మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని కీలక పదవి వరించింది. ఆ సంస్థ సెర్చ్‌ హెడ్‌గా దక్షిణ భారతానికి చెందిన ప్రభాకర్‌ రాఘవన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో బెన్‌గోమ్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాఘవన్‌ గూగుల్‌ క్లౌడ్‌ సేవలు, గూగుల్‌ యాప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గావ్యవహరిస్తున్నారు. జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌ నెలకు 100 కోట్ల యాక్టివ్‌ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్‌ కీలక పాత్ర పోషించారు. రాఘవన్‌ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈవో సుందర్‌ పిచాయ్‌కు అనుబంధంగా పనిచేయనున్నారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ పూర్తిచేసిన ప్రభాకర్‌ బెర్క్‌లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ సాధించారు. 2012లో గూగుల్‌లో చేరిన ఆయన 2018లో గూగుల్‌ అ‍డ్వర్టైజింగ్‌, కామర్స్‌ బిజినెస్‌ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్‌ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్‌ అనలిటిక్స్‌, షాపింగ్‌, పేమెంట్స్‌ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. గతంలో ఐబీఎం, యాహూ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. జీ సూట్‌లో స్మార్ట్‌ రిప్లై, స్మార్ట్‌ కంపోజ్‌, డ్రైవ్‌ క్విక్‌ యాక్సెస్‌లాంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్‌ ప్రభాకర్‌ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ప్రపంచ అత్యుత్తమ కంపెనీల నిర్వహణలో భారతీయుల పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది.

Latest Articles
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట