Covid-19 Vaccination: విదేశాల నుంచి వచ్చేవారికి ముఖ్య గమనిక.. ట్రావెల్ గైడ్‌లైన్స్ జారీ చేసిన కేంద్రం..

| Edited By: Phani CH

Oct 21, 2021 | 6:24 AM

Covid-19 Vaccination: విదేశాల నుంచి భారత దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. అయితే, ఇంతకు ముందున్న ప్రయాణ

Covid-19 Vaccination: విదేశాల నుంచి వచ్చేవారికి ముఖ్య గమనిక.. ట్రావెల్ గైడ్‌లైన్స్ జారీ చేసిన కేంద్రం..
Travel Guidlines
Follow us on

Covid-19 Vaccination: విదేశాల నుంచి భారత దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. అయితే, ఇంతకు ముందున్న ప్రయాణ మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టును సమర్పించాలంది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా సర్టిఫికెట్ చూపించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఈ మార్గదర్శకాలు ఈ నెల 25 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ మార్గదర్శకాలను కేటగిరీల వారీగా పేర్కొంది. ఏ, బీ కేటగిరీలుగా విభజించి.. ఆ మేరకు ట్రావెల్ గైడ్‌లైన్స్ జారీ చేసింది.

కేటగిరీ ‘ఏ’లోని దేశాల నుంచి భారత దేశానికి వచ్చే ప్రయాణికులు.. ఇండియాకు వచ్చిన తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సినేషన్ సర్టిపికెట్ చూపించాల్సి ఉంటుంది. ‘ఏ’ కేటగిరీలోకి వచ్చే దేశాలివే.. యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్‌ లోని దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే.

ఇక కేటగిరీ ‘బీ’లోకి వచ్చే దేశాలతో భారత ప్రభుత్వం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన కరోనా వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న వ్యక్తులకు జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీనికి ప్రకారం.. ఆయా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఇండియాలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, అర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగరీ, సెర్బియా దేశాలు ఉన్నాయి.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..