పనిమనిషిని వేధించిన భారతీయ దంపతులకు జైలుశిక్ష

|

Aug 21, 2020 | 7:27 PM

భారతీయ పని మనిషిని ఆ సైకో దంపతులు నరకం చూపించారు. రోజుకో రకం టార్చర్ చూపించారు. దేశం గానీ దేశంలో చిత్రవధకు గురిచేశారు. ఆ దంపతులు పెట్టే బాధ భరించలేక కోర్టును ఆశ్రయించింది. ఆ జంట బండారం బయటపడడంతో.. అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాదు సుమారు 5,500 సింగపూర్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

పనిమనిషిని వేధించిన భారతీయ దంపతులకు జైలుశిక్ష
Follow us on

భారతీయ పని మనిషిని ఆ సైకో దంపతులు నరకం చూపించారు. రోజుకో రకం టార్చర్ చూపించారు. దేశం గానీ దేశంలో చిత్రవధకు గురిచేశారు. ఆ దంపతులు పెట్టే బాధ భరించలేక కోర్టును ఆశ్రయించింది. ఆ జంట బండారం బయటపడడంతో.. అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాదు సుమారు 5,500 సింగపూర్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

భారత్‌కు చెందిన ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ అనే దంపతులు కొంతకాలంగా సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఇదే క్రమంలో ఇది అవసరాలను పనులు చేసేందుకు వారు అమన్‌దీప్ కౌర్ అనే భారతీయు మహిళను తమ ఇంట్లో పనిమనిషిగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ దంపతులు అమన్‌దీప్ కౌర్‌ను శారీరకంగా, మానసింగా వేధించారు. తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె అక్కడి కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. అమన్‌దీప్ కౌర్‌పై ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ దంపతులు ఇద్దరూ భౌతిక దాడి చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెను వారిద్దరూ మానసికంగా హింసించినట్లు కోర్టు గుర్తించింది. దీంతో.. కోర్టు.. ఫరా తెహ్సీన్‌కు 21నెలల జైలు శిక్షను విధించింది. మహ్మద్ తస్లీమ్‌కు నాలుగు నెలలపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా అమన్‌దీప్ కౌర్‌కు సుమారు 5,500 సింగపూర్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని కోర్టు వారిని ఆదేశించింది.