విశాఖ టెస్టు: సౌతాఫ్రికా చిత్తు ..టీమిండియా ఘన విజయం!

|

Oct 06, 2019 | 5:33 PM

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 203 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది.  చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించడంతో… సఫారీల ఆట సాగలేదు. 395 పరుగుల లక్ష్యంతో శనివారం […]

విశాఖ టెస్టు: సౌతాఫ్రికా చిత్తు ..టీమిండియా ఘన విజయం!
Follow us on

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 203 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది.  చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించడంతో… సఫారీల ఆట సాగలేదు. 395 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకు కుప్పకూలింది. చివరి రోజు 9 వికెట్లు పడగొట్టి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న టీమిండియా… అనుకున్నట్లుగానే పక్కా వ్యూహాలు అమలుచేసింది.

మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అశ్విన్‌.. డిబ్రుయిన్‌(10)ను బౌల్డ్‌ చేయగా తర్వాతి ఓవర్‌లో మహ్మద్‌ షమి బవుమా(0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఆపై వెనువెంటనే డుప్లెసిస్‌(13), డికాక్‌(0)లను కూడా షమి బౌల్డ్‌ చేయగా సౌతాఫ్రికా 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం జడేజా.. ఫిలాండర్‌(0), కేశవ్‌ మహారాజ్‌(0), మార్‌క్రమ్‌(39)లను ఔట్‌ చేయడంతో టీమిండియా గెలుపు లాంఛనమే అయింది. అయితే ముత్తుసామి(49; 108 బంతుల్లో 5×4), డేన్‌పీట్‌(56; 107 బంతుల్లో 9×4 1×6) పట్టుదలగా ఆడి 91 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో షమి 60వ ఓవర్‌లో పీట్‌ను బౌల్డ్‌ చేసి టీమిండియాకు మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. చివరగా రబాడ(18; 19 బంతుల్లో 3×4, 1×6) క్రీజులోకి వచ్చి మెరుపు బ్యాటింగ్‌ చేసినా షమి బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్‌ వెనుదిరిగాడు. షమి 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.

ఫలితంగా 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా చేతులెత్తేసింది. టెయిలెండర్లు శ్రమించినా… 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో కోహ్లీ టీం ప్రత్యర్థిని చిత్తుచేసి… తొలి టెస్టును కైవసం చేసుకుంది. 87 పరుగలకు 4 వికెట్లు పడగొట్టి… రవీంద్ర జడేజా… 35 పరుగులకే 5 వికెట్లు తీసి మహ్మద్ షమి… టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీసుకున్నాడు.