కోహ్లీ,బుమ్రాలకు విశ్రాంతి.. పంత్‌కు రీ-ఎంట్రీ..

|

Feb 02, 2020 | 1:32 PM

India Vs New Zealand: సంచలనాలు నమోదు కాలేదు.. అద్భుతాలు జరగలేదు. ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే టీమిండియా జైత్రయాత్ర కొనసాగించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపిస్తూ కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సాధారణంగా భారత్‌కు సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేయడం అలవాటు. సరిగ్గా ఆలాగే నాలుగో టీ20లో కూడా చేసి అద్భుత విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోమారు చివరి టీ20కు కూడా పలు కీలక మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగనుంది. ఇవాళ భారత్, […]

కోహ్లీ,బుమ్రాలకు విశ్రాంతి.. పంత్‌కు రీ-ఎంట్రీ..
Follow us on

India Vs New Zealand: సంచలనాలు నమోదు కాలేదు.. అద్భుతాలు జరగలేదు. ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే టీమిండియా జైత్రయాత్ర కొనసాగించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపిస్తూ కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సాధారణంగా భారత్‌కు సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేయడం అలవాటు. సరిగ్గా ఆలాగే నాలుగో టీ20లో కూడా చేసి అద్భుత విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోమారు చివరి టీ20కు కూడా పలు కీలక మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగనుంది. ఇవాళ భారత్, కివీస్‌ల మధ్య ఐదో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ బే ఓవల్ వేదికగా జరగనుంది.

ఆ పిచ్ బ్యాటింగ్‌‌కు అనుకూలించడమే కాకుండా.. బౌండరీలు కూడా చిన్నవి కావడంతో హోరాహోరీగా మ్యాచ్ జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు టీమిండియా విజయాల్లో కీలక పాత్రలు పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రాలకు విశ్రాంతిని ఇచ్చి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు.

కోహ్లీ స్థానంలో రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. సంజూ శాంసన్ మళ్ళీ ఓపెనర్‌గా దిగనున్నాడు. అటు గెలవాల్సిన మ్యాచ్‌లను చివరి నిమిషంలో ఒత్తడికి లోనయ్యి చేజార్చుకున్న కివీస్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. కాగా, ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.