India vs England 4th Test: శతక్కొట్టిన పంత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సుందర్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

India vs England 4th Test Live Score: భారత్ మరో వికెట్ చేజార్చుకుంది. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ సెంచ‌రీ (101; 118 బంతుల్లో) పూర్తిచేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అత‌నికిది..

India vs England 4th Test: శతక్కొట్టిన పంత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సుందర్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
India vs England 4th Test - Day 2 Highlights

Updated on: Mar 05, 2021 | 4:50 PM

India vs England 4th Test Live Score: భారత్ మరో వికెట్ చేజార్చుకుంది. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ సెంచ‌రీ (101; 118 బంతుల్లో) పూర్తిచేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అత‌నికిది మూడో సెంచ‌రీ. 116 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో పంత్ సెంచ‌రీ చేశాడు. అండర్సన్ వేసిన ఓవర్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అదే రూట్‌ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ‌రీ పంత్ సెంచ‌రీ పూర్తి చేయ‌డం విశేషం.

మొద‌ట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మ‌దిగా ఆడిన పంత్‌.. హాఫ్ సెంచ‌రీ పూర్తియ‌న త‌ర్వాత స్పీడు పెంచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ కొత్త బాల్ తీసుకున్న త‌ర్వాత వ‌రుస ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి పంత్‌ ఏడో వికెట్‌కు 113 ప‌రుగుల పార్ట్‌న‌ర్‌షిప్ నెలకొల్పాడు. మ‌రోవైపు సుంద‌ర్ కూడా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 96 బంతుల్లో 7ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. 205ల పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఒక దశలో 30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ జట్టు.. బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో ఊపిరిపోశాడు. అయితే అనంతరం కూడా భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోకల్‌ బాయ్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగో టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ కొట్టాడు. ఇక గత మూడు మ్యాచ్‌లలో తన స్పిన్‌తో మాయ జాలం చేసిన అశ్విన్‌ నాలుగో టెస్ట్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. హైదారాబాదీ ప్లేయర్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ను పడగొట్టాడు.

Also Read:

 

వరుసగా ఆరు సిక్స్ లు.. వైరల్ గా మారిన పొలార్డ్ వీడియో : Kieron Pollard six’s viral video.

Lottery: అదృష్టం అంటే అతడిదే.. యూఏఈలో లాటరీతో రూ.24 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..