#IndiaVsAustralia2020: విరాట్ కోహ్లీ సెన్సేషనల్ డెసిషన్.. చివరి వన్డేకు బుమ్రా స్థానంలో నటరాజన్..?
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ పేలవ ఆటతీరును కనబరుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ టీమిండియా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో పూర్తి విఫలమైంది.
India Vs Australia 2020: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ పేలవ ఆటతీరును కనబరుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ టీమిండియా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో పూర్తి విఫలమైంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో జట్టును ఆదుకునే క్రికెటర్ కరువైనట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ధోని, రోహిత్ శర్మల లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు వన్డేల్లో ఇండియాకు బెస్ట్ బౌలర్లు అనిపించుకున్న యుజవేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే రేపు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆరుగురు బౌలర్లతో భారత్ బరిలోకి దిగుతుందని టాక్. చివరి వన్డేకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. యార్కర్ స్పెషలిస్ట్ టి. నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని సమాచారం. అలాగే శార్దూల్ ఠాకూర్ కూడా ఆడే అవకాశం ఉందని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాలి. అలాగే బ్యాటింగ్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండవట.