యస్‌బ్యాంక్‌‌కు రేటింగ్స్‌లో ఝలక్

|

May 09, 2019 | 6:30 PM

న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌కు ఇండియా  రేటింగ్స్‌ సంస్థ షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంక్‌ లాంగ్ టర్మ్ రేటింగ్‌లో కోత విధించింది. కొన్ని రుణాలు మొండిబకాయిలుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొంది. వీటి విలువ  రూ.33వేల కోట్లు ఉండవచ్చని అంచనా. దీంతో ఈ బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఐఎన్‌డీ ఏఏ-కు చేర్చింది. ఇప్పటికే ఇక్రా సంస్థ కూడా యస్‌బ్యాంక్‌ రేటింగ్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంక్‌ మార్చి త్రైమాసికానికి రూ.1,506 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రొవిజన్ల 10 రెట్లు […]

యస్‌బ్యాంక్‌‌కు రేటింగ్స్‌లో ఝలక్
Follow us on

న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌కు ఇండియా  రేటింగ్స్‌ సంస్థ షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంక్‌ లాంగ్ టర్మ్ రేటింగ్‌లో కోత విధించింది. కొన్ని రుణాలు మొండిబకాయిలుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొంది. వీటి విలువ  రూ.33వేల కోట్లు ఉండవచ్చని అంచనా. దీంతో ఈ బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఐఎన్‌డీ ఏఏ-కు చేర్చింది. ఇప్పటికే ఇక్రా సంస్థ కూడా యస్‌బ్యాంక్‌ రేటింగ్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంక్‌ మార్చి త్రైమాసికానికి రూ.1,506 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రొవిజన్ల 10 రెట్లు పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.