ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ సమయంలో ప్రపంచం మొత్తానికి భారత్ ఔషధాలయం (ఫార్మసీ)గా మారిందని షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ

ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!

Edited By:

Updated on: Jun 22, 2020 | 2:30 PM

India playing ‘pharmacy of the world’ role: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ సమయంలో ప్రపంచం మొత్తానికి భారత్ ఔషధాలయం (ఫార్మసీ)గా మారిందని షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్ పొగడ్తలు గుప్పించారు. వైద్య చికిత్సలు, ఔషధాలపై ఇండియాకు ఎంతో అనుభవముందని ఆయన కితాబిచ్చారు. కాగా, ఇండియా ఇప్పటివరకూ 133 దేశాలకు కరోనా చికిత్సలో ఉపయోగపడే మందులను ఎగుమతి చేసిన సంగతి విదితమే.

గ్లోబల్ జనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రపంచంలో 20 శాతం, ప్రపంచానికి అవసరమైన వాక్సిన్ లలో 62 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయని నోరోవ్ తెలిపారు. వైద్య రంగంలో ఓ కీలక శక్తిగా ఉన్న ఇండియా కరోనా విషయంలో బాధ్యతాయుతమైన దేశంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో తాత్కాలిక సభ్యత్వ హోదా ఇండియాకు లభించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, శక్తిమంతమైన ఐరాసలోకి భారత్ ప్రవేశించడం శుభ పరిణామమని అన్నారు.

మరోవైపు.. చైనాలోని బీజింగ్ కేంద్రంగా నడుస్తున్న ఎస్సీఓ లో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇండియా, పాకిస్థాన్ లకు ప్రవేశం లభించింది. వీటితో పాటు చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ ప్రస్తుతం సభ్య దేశాలుగా ఉన్నాయి.