భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో […]

భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్

Edited By:

Updated on: Jun 13, 2019 | 4:57 PM

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో ప్రయోగించే చంద్రయాన్ -2పైనా, 2022లో ప్రయోగించే గగన్‌యాన్‌పైనా ఉందని తెలిపారు. గగన్‌యాన్ భారత దేశ తొలి మానవ సహిత కార్యక్రమమని తెలిపారు. గగన్‌యాన్‌ ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందన్నారు. రాబోయే 6 నెలల్లో ఈ వ్యోమగాముల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైనవారికి దాదాపు రెండేళ్ళపాటు కఠోర శిక్షణ ఇస్తామని శివన్ స్పష్టం చేశారు.