కరోనా ఎఫెక్ట్: భారత డాక్టర్లు కావాలంటున్న గల్ఫ్ కంట్రీస్.. ప్రధానికి విన్నపం..

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనాతో పోరాటంలో భారత మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది చేసిన సహాయానికి కువైట్ దేశం అబ్బురపడింది.

కరోనా ఎఫెక్ట్: భారత డాక్టర్లు కావాలంటున్న గల్ఫ్ కంట్రీస్.. ప్రధానికి విన్నపం..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 9:00 PM

India: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనాతో పోరాటంలో భారత మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది చేసిన సహాయానికి కువైట్ దేశం అబ్బురపడింది. మరి కొన్ని వైద్య బృందాలను పంపించాలంటూ కువైట్.. ప్రధాని మోదీని లిఖిత పూర్వకంగా అభ్యర్థించింది. ఇక యూఏఈ కూడా ..వైద్య సిబ్బందిని పంపించాలంటూ భారత్‌కు లిఖిత పూర్వక అభ్యర్థన పంపించింది. దీంతో వారు కోరిన విధంగా సాయం చేసేందుకు ప్రధాని మోదీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.

కాగా.. కరోనాతో పోరులో కువైట్‌కు తోడ్పాటును అందించేందుకు ప్రధాని మోదీ 15 మంది వైద్య సిబ్బంది ఉన్న మిలిటరీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను పంపించారు. వైద్య బృందం పనితీరు అక్కడి ప్రభుత్వాన్ని అమితంగా ఆకట్టుకుంది. అయితే.. వైద్య బృందం తమ పని పూర్తి చేసుకుని భారత్‌లో అడుగుపెట్టిన కొద్ది సేపటికే కువైట్‌ నుంచి ప్రభుత్వానికి మరో విన్నపం అందింది. మరి కొన్ని వైద్య బృందాలను కువైట్‌ పంపిచాలని అక్కడి ప్రభుత్వం కోరిందనేది ఆ లేఖ సారాంశం.

అయితే.. యూఏఈ కూడా ఈ రకమైన అభ్యర్థనతో భారత్‌ను సంప్రదించింది. మారిషస్, కొమోరోస్ వంటి దేశాలకు కూడా తమకు భారత వైద్య బృందాల సహాయం అవసరమవుతుందని ప్రభుత్వానికి ఇప్పటికే మౌఖికంగా సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ వీటికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం.

Also Read: కోవిద్-19: 100 కోట్ల మందికి సోకే ప్రమాదం.. భయపెడుతున్న రిపోర్ట్..

Latest Articles