న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పాకిస్థాన్ భారత్‌కు ఎగుమతి చేసే వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏకంగా 200 శాతం పెరిగింది.
దీంతో ఆ దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. తద్వారా ఆర్ధికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేస్తూ, ఆర్ధికంగా దెబ్బతీసే విధంగా భారత్ పావులు కదుపుతుందని విశ్లేషకులు అంటున్నారు.