పాక్‌ నేషనల్‌ డేను బహిష్కరించిన ఇండియా

|

Mar 22, 2019 | 3:45 PM

డిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ఇప్పటిలో చల్లబడేలా లేవు. ఇటీవలే  బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ లైవ్ ప్రసారాలను పాకిస్థాన్‌లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకు భారత్…పాక్‌కు సరైన కౌంటరిచ్చింది.  డిల్లీలోని పాకిస్థాన్‌ మిషన్‌లో శుక్రవారం జరగబోయే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ప్రతి సంవత్సరం మార్చి 23న జరిగే ఈ వేడుకలను పాకిస్థాన్‌ ఈసారి ఒకరోజు […]

పాక్‌ నేషనల్‌ డేను బహిష్కరించిన ఇండియా
Follow us on

డిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ఇప్పటిలో చల్లబడేలా లేవు. ఇటీవలే  బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ లైవ్ ప్రసారాలను పాకిస్థాన్‌లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకు భారత్…పాక్‌కు సరైన కౌంటరిచ్చింది.  డిల్లీలోని పాకిస్థాన్‌ మిషన్‌లో శుక్రవారం జరగబోయే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ప్రతి సంవత్సరం మార్చి 23న జరిగే ఈ వేడుకలను పాకిస్థాన్‌ ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకోవాలని నిర్ణయించింది. భారత్‌ తరపున ప్రతి ఏడాది ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే  ఈ కార్యక్రమానికి కశ్మీర్‌ వేర్పాటువాద నేతలను ఆహ్వానించిడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు భారత అధికారులు తెలిపారు. ఫుల్వామా ఘటనతో ఇరు దేశాల మధ్య ఏర్ఫడిన ఉద్విగ్న పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.