దేశంలో క‌రోనా వీర‌విహారం : ఒక్క‌రోజులో 836 మరణాలు

|

Aug 24, 2020 | 10:42 AM

దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. కొత్త‌గా గ‌డిచిన 24 గంటల్లో 61,408 కేసులు నమోదయ్యాయి. 836 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలువిడిచారు.

దేశంలో క‌రోనా వీర‌విహారం : ఒక్క‌రోజులో 836 మరణాలు
Follow us on

దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. కొత్త‌గా గ‌డిచిన 24 గంటల్లో 61,408 కేసులు నమోదయ్యాయి. 836 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలువిడిచారు. మరో 57,468 మంది వ్యాధి బారి నుంచి కోలకున్నారు.

కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 23,38,036 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. మొత్తం 57,542 మంది కరోనా వ‌ల్ల ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 75శాతానికి చేర‌గా..డెత్ రేటు 1.86శాతంగా ఉంది.  దేశంలో ప్ర‌స్తుతం 7,10,771  యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 6లక్షల శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 3కోట్ల 59లక్షల మందికి క‌రోనా టెస్టులు చేసిన‌ట్టు వెల్ల‌డించింది.

Also Read : ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్