దేశంలో క‌రోనా విల‌యం.. ఒక్కరోజే 55వేలు నమోదు

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ కేసుల పాజిటివ్ కేసుల‌ సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 క‌రోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో క‌రోనా విల‌యం.. ఒక్కరోజే 55వేలు నమోదు

Updated on: Jul 31, 2020 | 10:46 AM

Coronavirus Cases in India : దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ కేసుల పాజిటివ్ కేసుల‌ సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 16,38,871కు చేరింది. కాగా గ‌డిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 779 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 35,747కు చేరింది.

కాగా దేశంలో కరోనా మరణాల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా ఉంది. నిత్యం దాదాపు 700లకుపైగా వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్-19 మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో ప్లేసుకు చేరింది. అమెరికా, బ్రెజిల్‌, బ్రిటన్​, మెక్సికో మొద‌టి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇండియాలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 10లక్షల 57వేల మంది కోలుకున్నారు. మరో 5,45,318 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 బాధితుల రికవరీ రేటు 64.54శాతం ఉండగా, మరణాల రేటు 2.18శాతంగా ఉంది.

Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !