దేశంలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే 24,248 పాజిటివ్ కేసులు

|

Jul 06, 2020 | 9:46 AM

దేశంలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది​. గడిచిన 24 గంట‌ల్లో 24,248మందికి వైరస్​ సోకింది. మ‌రో 425మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసుల సంఖ్య 6,97,413కు చేరింది.

దేశంలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే 24,248 పాజిటివ్ కేసులు
Follow us on

దేశంలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది​. గడిచిన 24 గంట‌ల్లో 24,248మందికి వైరస్​ సోకింది. మ‌రో 425మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. మొత్తం క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 19,693కు పెరిగింది. దేశంలో వైరస్​ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెర‌గ‌డం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. ఇప్పటివరకు 4,24,433మంది వ్యాధి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ బులెటెన్ వివ‌రాలు

గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు.. 425 మంది మృతి

దేశవ్యాప్తంగా మొత్తం  6,97,413 కేసులు..19,693 మంది మృతి

దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 2,53,287 యాక్టీవ్ కేసులు..4,24,433 మంది డిశ్చార్జ్

దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు