భారత్‌కు మద్దతు.. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జపాన్..

|

Jul 03, 2020 | 5:11 PM

భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జపాన్ అంబాసిడర్ సంతోషి సుజుకీ తాజాగా స్పందించారు. ఇండియాకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్న ఆయన.. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

భారత్‌కు మద్దతు.. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జపాన్..
Follow us on

India- China Stand Off: భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జపాన్ అంబాసిడర్ సంతోషి సుజుకీ తాజాగా స్పందించారు. ఇండియాకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్న ఆయన.. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. భారత్-చైనా సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి ఏకపక్షంగా చేసే ప్రయత్నాలకు జపాన్ వ్యతిరేకిస్తుందని సుజుకీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో భారత్‌కు తమ మద్దతు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు.

”భారత్ విదేశాంగ  సెక్రటరీ హర్షవర్ధన్ ష్రింగ్లాతో వర్చ్యువల్ చర్చలు జరిగాయి. శాంతియుత తీర్మానాన్ని కొనసాగించడంతో పాటుగా GOI పాలసీని, LAC చుట్టూ నెలకొన్న పరిస్థితిపై ఆయన అద్భుతంగా వివరించారు. జపాన్ కూడా భారత్, చైనాల మధ్య నెలకొన్న పరిస్థితికి శాంతియుత పరిష్కారం దొరకాలని ఆశిస్తోంది. యథాతథ స్థితిని మార్చడానికి ఏకపక్షంగా చేసే ప్రయత్నాలను జపాన్ వ్యతిరేకిస్తుంది” అని సుజుకీ భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాను ప్రశంసిస్తూ పేర్కొన్నారు.

Also Read: చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!