Corona Virus Vaccine: మహమ్మారిపై ప్రపంచం పోరు… దేశాల జోరు… టీకాల పనితీరు…

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌‌కు అనుమతి ఇచ్చిన దేశాల జాబితాలో భారత దేశం 4 స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో

Corona Virus Vaccine: మహమ్మారిపై ప్రపంచం పోరు... దేశాల జోరు... టీకాల పనితీరు...

Edited By:

Updated on: Jan 04, 2021 | 5:02 AM

Vaccine: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌‌కు అనుమతి ఇచ్చిన దేశాల జాబితాలో భారత దేశం 4 స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ అంతానికి ముమ్మర కృషి జరుగుతోంది. ఇప్పటికే 13 వ్యాక్సిన్‌లు తుది/మూడోదశ ప్రయోగాలకు చేరుకున్నాయి. రష్యా, చైనా మినహా వీటిలో మొత్తం నాలుగు టీకాలు ఇప్పటికే అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. వీటిలో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ కూడా ఉంది. చైనా సినోఫార్మ్, రష్యా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ల పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కోటీ 20లక్షల మంది వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో…

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 154కు పైగా వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్‌ దశలో ఉన్నాయి. ప్రస్తుతం 20 వ్యాక్సిన్‌లు తొలి దశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా, మరో 16 వ్యాక్సిన్‌లు రెండో దశలో ఉన్నాయి. ఇక 13 వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. తుది దశ ప్రయోగాలను కొనసాగిస్తున్న 13 వ్యాక్సిన్‌లలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌లు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ మొదటగా అనుమతి ఇచ్చింది. తర్వాత మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్‌ అమెరికాలో అనుమతి పొందగా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌‌కు తాజాగా బ్రిటన్‌ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో చైనాకు చెందిన సినోఫార్మ్‌ అక్కడి ప్రజా వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా తుదిదశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్‌లు అత్యవసర/ప్రజా వినియోగం కింద అందుబాటులోకి వస్తున్నాయి.

 

– అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఫైజర్‌. దీన్ని తొలుత బ్రిటన్‌ ఆమోదించగా తర్వాత అమెరికా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
– అమెరికాలో అనుమతి పొందిన రెండో టీకా మోడెర్నా.
– మూడో వ్యాక్సిన్‌గా ఆస్ట్రాజెనెకా. దీనిని ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించాయి.
– భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.

Also Read: ఉప్పొంగిన అమిత్ షా, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం ఒక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్య, మోదీ, శాస్త్రవేత్తలకి అభినందనలు