ట్రినిడాడ్ వేదికగా జరుగుతోన్న అండర్- 19 ప్రపంచకప్ లో భారత జట్టు దూసుకెళ్లుతోంది. వరుస విజయాలు సాధిస్తూ టైటిల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్వార్టర్స్ చేరిన యంగ్ టీమిండియా శనివారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో పసికూన ఉగాండాను చిత్తు చేశారు. ఏకంగా 326 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో క్వార్టర్స్ లోకి అడుగుపెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజ్ బవా (108 బంతుల్లో 162 నాటౌట్, 14 ఫోర్లు, 8 సిక్స్ లు), రఘువంశీ (120 బంతుల్లో 144, 22 ఫోర్లు, 4 సిక్స్ లు) లతో ఉగాండా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.
ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ..
మరో ఓపెనర్ హర్నూర్ (15), కెప్టెన్ నిషాంత్ సింధు(15) విఫలమైనప్పటికీ యంగ్ టీమిండియా 400కు పైగా పరుగులు సాధించిందంటే అది రాజ్ బవా, రఘువంశీల విధ్వసక ఇన్నింగ్స్ లే కారణం. ఉగాండా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పోటీ పడి మరీ ఇద్దరూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు ఏకంగా 206 పరుగులు భారీ భాగస్వామ్యం అందించడంలో ప్రత్యర్థి ముందు 406 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫాస్కల్ (3/72) మాత్రమే ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. భారీ లక్ష్యాన్ని చూసి ముందే భయపడిపోయిందేమో భారత బౌలర్ల ధాటికి అసలు నిలవలేకపోయింది. కేవలం 19.4 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటౌంది. దీంతీ టీమిండియాకు 326 పరుగులు భారీ విజయం సొంతమైంది. బ్యాటింగ్ లో నిరాశపర్చిన కెప్టెన్ నిషాంత్ సింధు 4 వికెట్లతో ఉగండా బ్యాటర్లను వణికించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ తో టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. తాజా విజయంతో గ్రూప్-బి లో భారత జట్టు అగ్రస్థానంలో నిలిచింది.
All Over: Yet another comprehensive victory for India U19 as they beat Uganda U19 by a massive 326 runs in their final Group B game.
Nishant Sindhu takes 4/19. Earlier, Raj Bawa smashed 162 * & A Raghuvanshi scored 144 #BoysInBlue #U19CWC
Details ▶️ https://t.co/7xCHB938Wc pic.twitter.com/4K9UypsjOf
— BCCI (@BCCI) January 22, 2022
Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..
Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..
Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..