Share Market: ఆ షేర్స్‌లో పెట్టుబడితో రాబడి బూస్ట్.. ఏడాదిలో 6100 శాతం లాభం

భారతదేశంలో పెరిగిన అక్షరాస్యత కారణంగా ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే సరైన అవగాహనతో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్‌కు మించి రాబడినిచ్చే పథకం మరొకటి ఉండదని చెబుతున్నారు. మల్టీ-బ్యాగర్ స్టాక్‌లు అనేవి వాటి అసలు కొనుగోలు ధర కంటే చాలా రెట్లు ఎక్కువ రాబడిని అందించే కంపెనీ షేర్లు అని వివరిస్తున్నారు. అలాంటి సంస్థే డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ సంస్థ ఇది రిటైల్ పెట్టుబడిదారులకు కలల స్టాక్‌గా మారింది.

Share Market: ఆ షేర్స్‌లో పెట్టుబడితో రాబడి బూస్ట్.. ఏడాదిలో 6100 శాతం లాభం
Stock Market
Follow us

|

Updated on: Aug 21, 2024 | 3:45 PM

భారతదేశంలో పెరిగిన అక్షరాస్యత కారణంగా ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే సరైన అవగాహనతో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్‌కు మించి రాబడినిచ్చే పథకం మరొకటి ఉండదని చెబుతున్నారు. మల్టీ-బ్యాగర్ స్టాక్‌లు అనేవి వాటి అసలు కొనుగోలు ధర కంటే చాలా రెట్లు ఎక్కువ రాబడిని అందించే కంపెనీ షేర్లు అని వివరిస్తున్నారు. అలాంటి సంస్థే డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ సంస్థ ఇది రిటైల్ పెట్టుబడిదారులకు కలల స్టాక్‌గా మారింది. ఈ స్టాక్‌కు సంబంధించిన షేర్ ధర 11 నెలల అసాధారణమైన స్వల్ప వ్యవధిలో పెట్టుబడిదారుల డబ్బును ఆశ్చర్యపరిచే విధంగా 62 రెట్లు (6,100%) రాబడినిచ్చింది. ఈ నేపథ్యంలో అత్యధిక రాబడినిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సెప్టెంబరు 2023లో డీపీఐఎల్‌కు సంబంధించిన ఒక షేరు ధర రూ. 23.30గా ఉంటే ఇప్పుడు రూ. 1,430.60కి పెరిగింది. ఒక ఇన్వెస్టర్ అప్పట్లో ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే అతని పెట్టుబడి విలువ రూ.62 లక్షలుగా మారింది. డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది భారతదేశంలోని పురాతన విద్యుత్ పరికరాల తయారీదారులలో ఒకటి. ఇది ఫాస్ట్-మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంఈజీ) విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో జాబితా చేశారు. డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో ప్రమోటర్లు 90 శాతం వాటాను కలిగి ఉండగా, పబ్లిక్ వాటాదారులు 9.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) 0.08 శాతం వాటాను కలిగి ఉన్నారు.

సెప్టెంబర్ 2023లో కంపెనీ యొక్క ఒక షేరు ధర రూ. 23.30గా ఉంది. చివరి ట్రేడింగ్ సెషన్‌లో డీపీఐఎల్ షేరు 2 శాతం పడిపోయి రూ.1430.60 వద్ద ముగిసింది. తాజా సెషన్ ప్రకారం పెట్టుబడిదారుల డబ్బు కేవలం కొన్ని నెలల్లో 62 రెట్లు పెరిగింది. గత నెలలో ఈ స్టాక్ 13 శాతం లాభపడగా ఆరు నెలల్లో, ఈ మల్టీ-బ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు 348 శాతం రాబడిని ఇచ్చింది. డీపీఐఎల్ ఇటీవలే ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ లార్సెన్ & టూబ్రో నుండి 40.12 కోట్ల రూపాయల ఆర్డర్‌ను అందుకుంది. ఈ ఆర్డర్ ఏఎల్ 59 జీబ్రా కండక్టర్  న్యూ జనరేషన్ అల్యూమినియం అల్లాయ్ కండక్టర్ సరఫరా కోసం ఇచ్చారు. ఇది పీవీ ఫార్ములాతో “కిలోమీటర్లరేట్” ఆధారంగా అందుబాటులో ఉంటుంది. ఈ పనిని జూన్ 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డీపీఐఎల్ ఆదాయం 201 శాతం వృద్ధితో రూ.224 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.74 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం గతేడాది రూ.11 కోట్ల నుంచి రూ.24 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కూడా 180 శాతం పెరిగి రూ.17 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..