21 August 2024
మిల్కీబ్యూటీ డిమాండ్.. 5 నిమిషాలకు కోట్లు తీసుకుంటున్న తమన్నా..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా జోరు మీద దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.
తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. అలాగే అటు వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సైతం చేస్తుంది.
కొన్నిరోజులుగా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతూ సునామీ సృష్టిస్తోన్న స్త్రీ చిత్రంలోనూ తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆజ్ కి రాత్ అంటూ సాగే పాటకు తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరలయ్యాయి. ఈ సినిమాకు తమన్నా చేసిన సాంగ్ హైలెట్ అయ్యిందనే చెప్పాలి.
అయితే ఈ సాంగ్ కోసం తమన్నా భారీగానే డిమాండ్ చేసింది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ కోటి రూపాయాలు తీసుకుందట.
కేవలం 5 నిమిషాల నిడివిగల ఈ పాటకు రూ. కోటి పారితోషికం తీసుకుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే క్లారిటీ మాత్రం రా
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించిన స్త్రీ 2 సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి.