ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్‌ల ద్వారా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లను నియంత్రించవచ్చు. వారి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టవచ్చని గూగుల్ హెచ్చరించింది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాదు. చాటింగ్, వ్యాపార సమావేశాలు, బ్యాంకింగ్ మొదలైన వాటికి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.
ఇలా అనేక యాప్స్ వినియోగించడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ చేస్తే, మీరు భారీ నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది.
వాస్తవానికి, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా, స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న ఎడిటింగ్ యాప్‌ల సహాయంతో, హ్యాకర్లు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలలోకి చొరబడతారని గూగుల్ పేర్కొంది.
Meta తన నివేదికలో, Google Play Storeలో సురక్షితంగా లేని, అందుబాటులో ఉన్న అనేక ఎడిటింగ్ యాప్‌లను గురించి ప్రస్తావించింది.
చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా అప్‌లోడ్‌ల కోసం ఈ ఎడిటింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇది చాలా హానికరమని గూగుల్ హెచ్చరించింది.
ఫోటో ఎడిటింగ్ యాప్‌లలో 16 యాప్‌లు చైనాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం 2020 నుండి అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది.
Google Play Storeలో BeautyPlus- Easy Photo Editor, BeautyCam, Selfie Camera- Beauty Camera & Photo Editor, B612 వంటి డజన్ల కొద్దీ యాప్‌లు మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
గూగుల్ కూడా ఇదే నివేదికను విడుదల చేసింది. అందులో ఈ ఫోటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా ఫోన్‌కు మాల్వేర్ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది.