కంటి సబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే గోంగూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రేచీకటి సమస్య దూరమవుతుంది.
గోంగూరలో అధికంగా ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్‌లు గర్భిణీలకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
రక్త హీనత సమస్యతో బాధపడేవారికి గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో లభించే ఐరన్ ఈ సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా గోంగూర ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి శరీరాన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తుంది.
గోంగూరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్‌తో సహా అనేక వ్యాధులను దరిచేరనివ్వదు.
డయాబెటిస్ రోగులకు కూడా గోంగూర బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఫైబర్ కంటెంట్‌కు పెట్టింది పేరు గోంగూర.. క్రమంతప్పకుండా గోంగూరను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా గోంగూర ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.