AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేవీ రంగంలో నారీమణులు

అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ విహంగ విహారంలోకి అడుగుపెట్టారు. భారత యద్ధనౌకలలో ఇద్దరు మహిళా నేవీ అధికారిణిలను నియమించారు.

నేవీ రంగంలో నారీమణులు
Balaraju Goud
| Edited By: |

Updated on: Sep 21, 2020 | 5:49 PM

Share

అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ విహంగ విహారంలోకి అడుగుపెట్టారు. భారత యద్ధనౌకలలో ఇద్దరు మహిళా నేవీ అధికారిణిలను నియమించారు. యుద్ధ నౌకల్లో మహిళా నేవీ అధికారిణిలను నియమించడం ఇదే తొలిసారి. సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ ను ఎంపిక చేసింది నావీ. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ‘వింగ్స్’ ప్రధానం చేశారు. యుద్ధ నౌకలలోని హెలీకాప్టర్ల విభాగంలో వైమానిక వ్యూహకర్తలుగా వీరు వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు నౌకా కేంద్రాల్లోని హెలీకాప్టర్లను మహిళా అధికారిణులు నడిపేవారు. ఇప్పుడు తొలిసారిగా యుద్ధ నౌకపై కూడా హెలీకాప్టర్లను సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ నడపనున్నారు. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలోని ఇండియన్ నేవీ అబ్జర్వర్ కోర్సులో ఉత్తీర్ణులైన 17 మందిలో వీరిద్దరితోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన నలుగురు మహిళా అధికారిణిలు, ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు.. మహిళలకు హెలికాప్టర్ ఆపరేషన్లలో తొలిసారి శిక్షణ ఇవ్వడం ఒక మైలురాయి వంటిదని రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్ అన్నారు. భారత నావికాదళం‌లో ముందుండే యుద్ధనౌకలలో మహిళలను మోహరించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

Follow Us
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం