శాంతి చర్చలకు రండి: మోదీకి పాక్ ప్రధాని మరోసారి లేఖ

శాంతి చర్చల ఒప్పందానికి ముందుకు రావాలంటూ ప్రధాని మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి లేఖ రాశారు. కశ్మీర్ అంశంతో సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆ లేఖలో ఇమ్రాన్ తెలిపినట్లు పాక్ మీడియా స్పష్టం చేసింది. వచ్చే వారం బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన సందర్భంగా పాక్ ప్రధాని లేఖ రాయడం చర్చనీయాంశమైంది. రెండోసారి ప్రధానిగా […]

శాంతి చర్చలకు రండి: మోదీకి పాక్ ప్రధాని మరోసారి లేఖ

Edited By:

Updated on: Jun 08, 2019 | 2:50 PM

శాంతి చర్చల ఒప్పందానికి ముందుకు రావాలంటూ ప్రధాని మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి లేఖ రాశారు. కశ్మీర్ అంశంతో సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆ లేఖలో ఇమ్రాన్ తెలిపినట్లు పాక్ మీడియా స్పష్టం చేసింది. వచ్చే వారం బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన సందర్భంగా పాక్ ప్రధాని లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి తన లేఖలో అభినందనలు తెలిపిన ఇమ్రాన్… ఇరుదేశాల ప్రజలు పేదరికాన్ని అధిగమించాలంటే రెండు దేశాల మధ్య చర్యలే మార్గమని పేర్కొనినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ అభివృద్ధికి ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయడం అత్యంత కీలకమని ఇమ్రాన్ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే ఈ లేఖపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమంటూ ఇమ్రాన్ పేర్కొనడం ఇది రెండోసారి.