ముంబై నగరవాసులకు వాతావరణశాఖ ‘ఆరంజ్ అలర్ట్’!

| Edited By:

Sep 04, 2019 | 9:27 AM

ముంబై నగరవాసులకు కేంద్ర వాతావరణశాఖ బుధవారం ‘ఆరంజ్ అలర్ట్’ జారీ చేసింది. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.ముంబైలోని సియాన్, పరేల్, దాదర్, బైకుల్లా ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల వరదనీరు పోటెత్తింది. నగరంలోని కింగ్ సర్కిల్, రైల్వేస్టేషను, గాంధీ మార్కెట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం వరకు ముంబైలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజలు 100కు […]

ముంబై నగరవాసులకు వాతావరణశాఖ ‘ఆరంజ్ అలర్ట్’!
Follow us on

ముంబై నగరవాసులకు కేంద్ర వాతావరణశాఖ బుధవారం ‘ఆరంజ్ అలర్ట్’ జారీ చేసింది. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.ముంబైలోని సియాన్, పరేల్, దాదర్, బైకుల్లా ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల వరదనీరు పోటెత్తింది. నగరంలోని కింగ్ సర్కిల్, రైల్వేస్టేషను, గాంధీ మార్కెట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం వరకు ముంబైలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజలు 100కు డయల్ చేయాలని ముంబై పోలీసులు కోరారు. ముంబై నగరంతోపాటు పాల్గార్, రాయగడ్, రత్నగిరి ప్రాంతాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.